శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి వజ్రోత్సవ వేడుకలు

తొమ్మిది రోజుల పాటు గ్రామంలో పండుగ వాతావరణం   రుద్రూర్, బతుకమ్మ:  జిల్లాలో ఎక్కడా లేని విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రుద్రూర్ లో జరిగే నవరాత్రి ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ నిర్వహించే ఉత్సవాలకు జిల్లా నలుమూలాల నుంచి భక్తులు తరలివస్తారంటే ఎంతంటి ప్రత్యేకత ఉందో అర్ధం చేసుకో వచ్చు. 75 ఏళ్లుగా రుద్రూర్ సార్వజనిక్ గణేష్ మండలి ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం వజ్రోత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఘనమైన ఏర్పాట్లు...