- వీడీసీ ఆధ్వర్యంలో అన్నదానం
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మెండోరా గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సాయి మందిరంలో ప్రతిష్టాపన ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.ప్రతిష్టపానలో భాగంగావేద పండితులు గత మూడు రోజులుగా ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అభిషేకం, పూర్ణాహుతి, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు దీపారాధన, పుణ్యాహవాచనం నవగ్రహ పూజలను నిర్వహించారు. శ్రీ సాయిబాబా విగ్రహం తోపాటు గణపతి, శివలింగం, దత్తాత్రేయ స్వామి విగ్రహాలను కూడా ఆలయంలో ప్రతిష్టించారు. ఈ సందర్బంగా మెండోరా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు మహిళలు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.