Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2024, 3:26 pm Posted by : ramakrishna

శ్రీరాం సాగర్ 20 గేట్లు ఎత్తి వేత

గోదావరిలోకి 62,480 క్యూసెక్కుల నీటి విడుథల

మెండోరా, బతుకమ్మ :

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 90, 470 క్యూసెక్కుల వరద నీరు డ్యామ్ లోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.5 టిఎంసిల వరకు నీటి నిల్వ చేసి మిగతాది దిగువకు వదులుతున్నారు.ఉదయం నుంచి ప్రవాహం పెరిగినట్లు 5 గేట్లు తరువాత 10,15 ను చోప్పున ఎత్తిన అధికారులు ఇన్ ప్లో పేరుగడంతో ప్రాజెక్ట్ 42 గేట్లకు గాను 20 గేట్లు ఎత్తి  గోదావరిలోకి 62,480 క్యుసేక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా 6800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1200 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కుల నీటిని, లక్ష్మీ కాల్వకు 50 క్యూసెక్కులు మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు.

Sri Ram Sagar lifted 20 gates