రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండ కేంద్రం తో పాటు అంబం (ఆర్) గ్రామ పరిధి అయిన లక్ష్మీపూర్ క్యాంప్ శ్రీ రామాలయంలో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీత రాములకు, గ్రామంలో ఊరేగింపు చేసి అనంతరం శ్రీ రామాలయంలో ప్రదక్షణలు చేసిన తర్వాత తలంబ్రాలు సీతారాముల కళ్యాణం చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ నిర్వాహకులు పత్తి రాము, అడప నవీన్, పత్తి నవీన్, అడప వినోద్, ప్రశాంత్ గౌడ్, హనుమాన్ స్వాములు, లక్షిపూర్ గ్రామ పెద్దలు, ఆలయాల అధ్యక్షుడు, మేక శ్రీనివాస్, సెక్రటరీ నెక్కాంటి సురేష్, కె.సత్యనారాయణ, ఒళ్లూరి సత్యనారాయణ, నెక్కంటి రాంబాబు, జై బాబా, అంజిబాబు, మేక సాయిబాబు, ప్రశాంత్, భాస్కర్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
