Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 3:38 pm Posted by : ramakrishna

ఘనంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితులు శ్రీనివాస్ శర్మ, రోహిత్ శర్మలచే శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను జరిపించి, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అక్బర్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ తీగుళ్ల గంగామణి రాజవరప్రసాద్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sri Padmavati Venkateswara Swamy Kalyana Mahotsavam celebrated in grand style