కొండకేగిన శ్రీ నింబచల లక్ష్మినృసింహుడు

బోనాలు, మంగళహరతులతో స్వామి ఊరేగింపు భీమ్ గల్, బతుకమ్మ : శ్రీమాన్నింబచల లక్ష్మినృసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన కార్తీక శుద్ధ గురువారం శ్రీవారి ఉత్సవ మూర్థులు భీమ్ గల్ గ్రామాలయం నుండి నింబచల కొండకు బయలుదేరాయి.ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు గ్రామాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. క్షేత్ర పురాణంలోస్వామి వారి ఆజ్ఞ మేరకు గ్రామ దేవత పెదంగంటి ఎల్లమ్మకు సౌభాగ్య సారెను ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి, అర్చకులు సమర్పించారు.అనంతరం స్వామి వారికి నైవేద్యం పెట్టి, హారతినిచ్చారు. తదనంతరం శ్రీలక్ష్మినృసింహాల...