కొండకేగిన నింబాచల శ్రీ లక్ష్మీనృసింహుడు
గ్రామాలయం నుండి పల్లకిలో ఊరేగింపుగా బయలుదేరిన శ్రీవారి ఉత్సవమూర్తులు అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం భీమ్ గల్, బతుకమ్మ : ప్రతియేటా కార్తీక మాసంలో నిర్వహించే లింబాద్రిగుట్ట లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామాలయం నుండి శ్రీవారి ఉత్సవమూర్తులు పల్లకిలో లింబాద్రిగుట్టకు చేరాయి. ముందుగా భీమ్ గల్ పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీవారి గ్రామాలయం లో ఉండే ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి నైవేద్యాన్ని నివేదించి హారతినిచ్చి పల్లకిలో ఉంచి గ్రామాలయం చుట్టూ ప్రధాక్షణ గావించి లింబాద్రిగుట్టుకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వామీవారిని...