Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 10:21 pm Posted by : ramakrishna

కొండకేగిన నింబాచల శ్రీ లక్ష్మీనృసింహుడు

  • గ్రామాలయం నుండి పల్లకిలో ఊరేగింపుగా బయలుదేరిన శ్రీవారి ఉత్సవమూర్తులు
  • అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Sri Lakshmi Narasimha, the goddess of the mountain,

భీమ్ గల్, బతుకమ్మ : ప్రతియేటా కార్తీక మాసంలో నిర్వహించే లింబాద్రిగుట్ట లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామాలయం నుండి శ్రీవారి ఉత్సవమూర్తులు పల్లకిలో లింబాద్రిగుట్టకు చేరాయి. ముందుగా భీమ్ గల్ పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీవారి గ్రామాలయం లో ఉండే ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి నైవేద్యాన్ని నివేదించి హారతినిచ్చి పల్లకిలో ఉంచి గ్రామాలయం చుట్టూ ప్రధాక్షణ గావించి లింబాద్రిగుట్టుకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వామీవారిని గుట్టకు పల్లకిలో  ఉంచి పల్లకిని బోయిలు మోస్తుండగా,మహిళామణుల మంగళహారతులు, మంగళవాయిద్యాలు,బాజాభజన్త్రీలు, మేళా తాళల మధ్య గోవిందనామ స్మరణతో అంగడిబజార్ గుండా పట్టణ వీధుల గుండా పురానిపేట్ మీదుగా పాదయాత్రతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వామి వారు పల్లకిలో వెళ్తుండగా రోడ్డు వెంట ఎల్లా మహిళాలు తమ తమ ఇండ్ల నుండి  హారతులతో వచ్చి శ్రీవారికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం ప్రారంభం అయిన స్వామి వారి పల్లకి యాత్ర రాత్రి 9.30 కు లింబాద్రిగుట్ట పైన గల కల్యాణ మంటపానికి చేరింది. శ్రీవారి ఉత్సవ మూర్తులు గుట్టకు చేరడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.

Sri Lakshmi Narasimha, the goddess of the mountain,