ఇస్కాన్ కంటేశ్వర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ కంటేశ్వర్ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జన్మాష్టమి కార్యక్రమాలను నగరంలోని ఆర్మూర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కేంద్ర నిర్వాహకుడు రామానందరాయ గౌరదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటల వరకు అభిషేకము హారతి మహా అన్న ప్రసాదము సాంస్కృతిక కార్యక్రమాలు ఊయల సేవా , జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. లోక కళ్యాణం కోసము భగవంతుడు...