Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 February 2025, 1:50 pm Posted by : ramakrishna

కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు

తిరుపతి, బతుకమ్మ : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో కొనసాగుతున్నాయి. ఏడో రోజైన మంగ‌ళ‌వారం శ్రీ కపిలేశ్వరస్వామి కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుంచి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జీవో కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖ‌ర్‌, ఆల‌య అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.