సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, బతుకమ్మ :  శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి  బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సింహ వాహనం – ధైర్య సిద్ధి శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌స్వామి మూడో రోజు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని...