Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:27 pm Posted by : ramakrishna

రేపు ఇందల్వాయి గ్రామంలో శ్రీ జగన్నాథ రథయాత్ర

 

. . . ప్రభుత్వం నుండి అనుమతి

 

. . . ప్రతి ఒక్కరు హాజరుకావాలని విజ్ఞప్తి

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలో శుక్రవారం జరిగే శ్రీ జగన్నాథ్ రథయాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని హిందూ బందువులు విజ్ఞప్తి చేశారు. భక్తులందరూ మధ్యాహ్నం రెండు గంటలకు ఇందల్వాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుండి అతి పురాతన ఆలయమైన శ్రీ రామచంద్ర ఆలయానికి జగన్నాథ రథయాత్ర చేరుకుంటుందని అందరూ ఈ రథయాత్రలో భాగస్వాములు కావాలని సర్పంచ్ లోకని గంగమని గంగారం, ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కూర్ నవీన్ గౌడ్ తెలిపారు. మతాలకు అడుగునంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని హితవు పలికారు. స్వామివారి కృప కటక్షాలను అందుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకొని అనంతరం ఇందల్వాయి గ్రామంలోని శ్రీ గంగపుత్ర కళ్యాణ మండపంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని భక్తులకు సూచించారు. అనంతరం అక్కడే అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.