Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 9:28 pm Posted by : ramakrishna

ఈ నెల 18న ఇందల్వాయిలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం

 

. . . రథయాత్రకు రావాలని ఎస్సైకి ఆహ్వానం

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో ఈ నెల 18వ తేదీ శనివారం మధ్యాహ్నం శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు రథయాత్ర మహోత్సవ కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా రథయాత్ర కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఇందల్వాయి ఎస్సై భూక్య సుమలతతో పాటు జ్ఞాన వాగ్దేవి పాఠశాల ప్రిన్సిపాల్, నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్‌లకు గ్రామ ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు ఆహ్వానం అందజేశారు. గ్రామ సర్పంచ్ లోకని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రియాజ్, బాగిర్తి నారాయణ, సత్యం, గంగాధర్ తదితరులు ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రథయాత్ర కమిటీ కోరింది.