బతుకమ్మ,కమ్మర్ పల్లీ: కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గల శ్రీ జగదాంబ దేవి రథోత్సవం, జాతర ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రథాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులందరూ రథాన్నిలాగుతూ దేవి నామస్మరణ చేశారు. జాతర సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొని దైవాశీస్సులు పొందారు. ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాల స్వీకరించారు.