Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 8:13 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే ను ఆహ్వానించిన శ్రీగోవింద సాయి భక్తులు

వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండల కేంద్ర శివారులో గల శ్రీగోవింద సాయి దివ్య యోగాశ్రమం, శ్రీషిరిడి సాయి దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం ఎమ్మెల్యే స్వగృహం లో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ నెల 4 దత్తాత్రేయ జయంతి వేడుకలకు హాజరవ్వాలని కోరారు. ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో ఆలయ కమిటీ క్రియాశీల కార్యవర్గ సభ్యులు అబ్బగోని జగదీశ్వర్ గౌడ్, రాజారపు బాలరాజు (సాయిరాం బాల్ రాజ్) కూశన్నగారి నర్సయ్య, గడ్డం మల్లేష్ తదితరులు ఉన్నారు.