ఇందూరు తిరుమలలో కన్నులపండువగా శ్రీ గోదా రంగనాథ కళ్యాణం
మోపాల్, బతుకమ్మ: మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రీ గోదా రంగనాథ కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. సోమవారం జరిగే గోదా కళ్యాణంతో పరమ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తుందని ఆచార్యులు సంపత్ కుమారాచార్య తెలిపారు. గోదాదేవి ఎంతో నిష్టతో శ్రీ వ్రతం చేసి రంగానాథుడిని కళ్యాణమాడి వారిలో లీనమైందని తెలిపారు. ధనుర్మాసంలో తిరుప్పావై పఠనం మనకు వైకుంఠ నాధుడిని హృదయానికి చేరువ చేస్తుందని అన్నారు. గ్రామస్థులు ,చుట్టు పక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో...