Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2025, 7:51 pm Posted by : ramakrishna

ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ గౌరి పూర్ణిమ మహోత్సవం

భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ పట్టణంలోని వాగు గడ్డ (మోక్ష నంద ఆశ్రమం) హనుమాన్ ఆలయం  లో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీగౌరి పౌర్ణిమ మహోత్స వాన్ని నిర్వహించారు. మహిళలు, మంగళ హారతులతో గౌర పూజను ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో కృష్ణ భక్తులు, నాట్య నృత్యాలతో ,భజనలు చేశారు . ప్రభుజీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో  చైతన్య ప్రభూజి ఆవిర్భవించాడని, ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడిగా అవర్భవించి ఈ మొత్తం భూగోళం అంతా భక్తి దైవం ఉద్యమంతో నింపాలని శ్రీకృష్ణ భక్తులుగా  తయారవ్వాలన్నారు. ఆయన భూమి మీద అలాగే ఐదు వందలసంవత్సరాల కాలం పాటు పరంపరలో వచ్చిన నిత్యానంద ప్రభు,గురు, శిష్యుల పరంపరం లో అంతా కూడా హరే కృష్ణ హరే రామ రామ రామ హరే హరే అంటూ మంత్రాన్ని కీర్తిస్తూ,జపిస్తూ భగవద్గీతను, భాగవతాన్ని, ప్రపంచమంతటా ప్రచారం చేయడానికి వాళ్ళ గురు, శిష్యుల పరంపరలో వచ్చిన స్వామి శిల్ప శ్రీపాద వారు భగవతాన్ని ఇంగ్లీష్ భాషలలో అనువదించి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే వందకు పైగా భాషలలో ప్రచురించి, ఆ పరంపర లో భాగంగానే ఆ ప్రభుజి శిష్యులందరూ కూడా ఈ శ్రీ గౌరీ పూర్ణిమ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంతున్నారని అన్నారు. ప్రతి ఆదివారం అన్న సత్రం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభూజి గంగాసాగర్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, సనాతన, శివకుమార్, ప్రశాంత్, నరేష్, మల్లిక గంగాధర్, మురళి, నిజామాబాద్ ప్రభువులు, తదితరులు పాల్గొన్నారు.