Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 8:25 pm Posted by : ramakrishna

నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల

  • వర్షపు నీటిలో హాస్టల్ భవనం దిగ్బందం
  • విద్యార్ధులను బైపాస్ లోని క్యాంపస్ తరలించిన పోలీసులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గూపన్ పల్లిలో గల శ్రీ చైతన్య స్కూల్ భవనం నీట మునిగింది. పూలాంగ్ వాగు బఫర్ జోన్ లో స్కూల్ ఉండటంతో అక్కడే ఉన్న హస్టల్ భవనం చుట్టురా నీటితో నిండిపోయింది. జిల్లా కేంద్రంలో కురిసిన బారీ వర్షంకు తోడు పులాంగ్ వాగు నీటి విడుదల, మాసని చెరువు గేట్లు ఎత్తడంతో పూలాంగ్ వాగు ఉధ్రుతంగా ప్రవహిస్తుంది. రెండు రోజులుగా విద్యార్ధులను పాఠశాల యాజమాన్యం సురక్షిత ప్రాంతానికి

Sri Chaitanya School submerged in water

తరలించడంలో తాత్సరం చేసింది. గురువారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ పోలీసులు హాస్టల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో తప్పని సరి పరిస్థితిలో హాస్టల్ లోని విద్యార్ధులను  అనుమతులు లేకుండా జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డులో నిర్వహిస్తున్న సిబిఎస్ఇ స్కూల్  క్యాంపస్ కు తరలించారు. జిల్లాలో భారీ వర్షాలతో అతలకుతలం అవుతుండగా ఎలాంటి సంరక్షణ చర్యలు లేకుండా వాగు ప్రక్కన హాస్టల్ భవనంలో విద్యార్ధులను ఉంచడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Sri Chaitanya School submerged in water