Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 9:21 pm Posted by : ramakrishna

పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం

  • ఎంఈఓ ఆఫీస్ కు కూతవేటు దూరంలో అమ్మకాలు
  • పట్టుకున్న డివైఎఫ్ఐ నాయకులు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్ముతూ ఎంఈఓ ఆఫీస్ దగ్గరలోనే ఓ ఇంట్లో పుస్తకాల డంపును ఏర్పాటు చేసి అమ్ముతుండగా శుక్రవారం డి వై ఎఫ్ ఐ విద్యార్థి నాయకులు మహేష్ ఆధ్వర్యంలో పట్టుకొని ఎంఈఓకు సమాచారం అందించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఓ ఇంటిలో పుస్తకాలను డంపు చేసి విద్యార్థులకు వారే స్వయంగా అధిక ధరలకు అమ్ముతున్నట్లు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ అన్నారు. శ్రీ చైతన్య యాజమాన్యంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.  ఎంఈఓ ఆఫీసుకు కూత వేటు దూరంలో పుస్తకాలు అమ్ముతుండడం అధికారులకు ఎందుకు తెలియడం లేదని ప్రశ్నించారు. వెంటనే పుస్తకాల స్టోర్ ను సీజ్ చేసి విద్యాసంస్థ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ శ్రీ చైతన్య పాఠశాల పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదని  విద్యార్థి నాయకులు తెలిపారు.వెంటనే స్పందించిన ఎంఈఓ ఎంఆర్సి సిబ్బంది పంపించి నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య పాఠశాల ఇంటిని సిజ్ చేశారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ యాదవ్,సాయి చందు, బాల సాయి లు పాల్గొన్నారు.

Sri Chaitanya School management selling books