Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 8:40 pm Posted by : ramakrishna

పది ఫలితాల్లో శ్రీ అరబిందో విజయదుందుబి

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నగరంలోని దుబ్బ ప్రాంతంలో గల శ్రీ అరబిందో హై స్కూల్ విద్యార్థులు విజయదుందబి మోగించారని పాఠశాల సెక్రటరీ టి.లింగారెడ్డి తెలిపారు. తమ విద్యార్థులు 30మంది పరీక్ష రాయగా 22మంది 500లకు పైగా మార్కులు సాధించారని అన్నారు. టి.శివరాజ్ 556/600మార్కులు, జె.మనస్వని 555/600 మార్కులు, జి.స్వాతి 553/600, బి.స్వప్న 545/600, యూ.అభిలాష్ 542/600, జి.మదులత 541/600 మార్కులు, ఈ.శ్రావ్య  538/600, జె.శివాని 537/600 మార్కులు, అర్బజ్ ఖాన్ 531/600మార్కులు, జె.వివేకనంద 529/600 మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.