నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
ఇంటర్ ఫలితాలలో నిజామాబాద్ ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థుల అత్యుత్తమ మార్కులతో మరో మారు విజయభేరి మ్రోగించారు. ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో ఎస్.చందన, అస్మిత్ గౌడ్,సరయు,స్పందన,అఖిలేష్ లు 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి జిల్లా టాపర్ లుగా నిలిచారు. అలాగే 8 మంది విద్యార్థులు 467,10 మంది 466,14 మంది 465,11 మంది 464,15 మంది 463,16 మంది 462,12 మంది 461,14 మంది 460 మార్కులు సాధించారు. కళాశాలకు చెందిన 105 మంది విద్యార్థులు ఎంపీసీలో 460 పైగా మార్కులు సాధించి సత్తా చాటారు.ప్రథమ సంవత్సర బైపీసీ విభాగంలో అర్షియా అర్జున్,జి.మానుశ్రీ,జె.అనుష,జె.స్నేహ లు 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. అలాగే నలుగురు విద్యార్థులు 437,నలుగురు 436,ఆరుగురు 435,ఐదుగురు 434,ఏడుగురు 433,నలుగురు 432,ముగ్గురు 431,నలుగురు 430 మార్కులు సాధించారు. ఇలా మొత్తం 41 మంది విద్యార్థులు బైపీసీ లో 430 పైగా మార్కుల సాధించి సత్తా చాటారు.

ప్రథమ సంవత్సర సీఈసీ విభాగంలో సిద్దిఖ్ 482 మార్కులు,బి.సిరి చందన 481 మార్కులు సాధించారు.
ద్వితీయ సంవత్సర ఎంపీసీ విభాగంలో ఎన్.దినేష్ 1000 కి 995 మార్కులతో జిల్లా టాపర్ గా నిలిచాడు. అలగే ముగ్గురు విద్యార్థులు 993,నలుగురు 992,నలుగురు 991,ఇద్దరు 990 మార్కులు సాధించారు. ఇలా 14 మంది విద్యార్థులు 990 కి పైగా మార్కులతో సత్తా చాటారు.ద్వితీయ సంవత్సర బైపీసీ విభాగంలో యు.జఫీన్,పి.హన్మిత,కె.తిరుమల లు 1000 కి 991 మార్కులు సాధించారు. అలాగే ఇద్దరు విద్యార్థులు 990 మార్కులు సాధించి సత్తా చాటారు. ద్వితీయ సంవత్సర సీఈసీ విభాగంలో కె.సంకీర్తన 967 మార్కులతో టాపర్ గా నిలవగాఎంఈసీ విభాగంలో జె.దీపిక 955 మార్కులతో టాపర్ గా నిలిచింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో డీజీఎం గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్.ఆర్ టాప్ క్లాస్ షెడ్యూల్స్,అత్యుత్తమ అప్ డేటేడ్ మెటిరీయల్స్,వారాంతపు పరీక్షలు,యావరేజ్ స్టూడెంట్స్ పై కూడా ప్రత్యేక శ్రద్దతో ప్రత్యేక తరగతులు నిర్వహిండచం,బేసిక్స్ లేని విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వచ్చే విధంగా ప్రోత్సహించడం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. కళాశాల ప్రారంభం నుండే ఇంటర్ క్లాసులతో పాటు కోచింగ్ క్లాసులు నిర్వహించడం,సీనియర్ అధ్యాపకుల డౌట్స్ క్లారిఫికేషన్ వల్లనే అత్యుత్తమ ఫలితాలే సాధించారన్నారు.నిజామాబాద్ జోనల్ ఇన్ చార్జ్ శ్రీకాంత్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎస్.ఆర్ కాలేజ్,గ్రామీణ,పట్టణ ప్రాంత విద్యార్థులకు తమ విజయం సాధించే గమ్య స్థానంగా నిలుస్తుందన్నారు. మెరుగైన హాస్టల్ సౌకర్యం,హైజెనిక్ భోజనంతో పిల్లలు అత్యుత్తమంగా రాణిస్తున్నారన్నారు. నిజామాబాద్ అకాడమిక్ డీన్ రాంబాబు మాట్లాడుతూ ఎంపీసీ విభాగంలో ఫోకస్,స్పార్క్,యావరేజ్ స్టూడెంట్స్ కోసం టైటాన్,ఆర్సీ,అలాగే ప్రారంభం నుండే ఎంసెట్,జేఈఈ(మెయిన్),జేఈఈ(అడ్వాన్స్) కోచింగ్ అందించడం వల్ల మంచి ర్యాంకులు సాధిస్తున్నారన్నారు.ఈ విజయం సాధించిన విద్యార్థిని,విద్యార్థులను ఎస్.ఆర్ చైర్మన్ ఎనుగందుల వరదారెడ్డి,డైరక్టర్లు మధుకర్ రెడ్డి,సంతోష్ రెడ్డి,సీఈవో సురేందర్ రెడ్డి లు అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ హన్మంత్ రావు,శ్రీధర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,దేవేందర్ రెడ్డి,మురళిధర్ ,నరసింహ రెడ్డి,విద్యార్థిని విద్యార్థులు,వారి తల్లిదండ్రులు,అధ్యాపకులు,స్టాఫ్ పాల్గొన్నారు.
