. . . ఇంజనీరింగ్ . . . అగ్రీకల్చర్ ఫార్మసీలో ర్యాంకుల పంట
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఆదివారం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఈఏపీ సెట్ -2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో అనేక మంది విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం విశేషం. ఎంపీసీ ఇంజనీరింగ్ విభాగంలో జె. గురుమోహన్ చరణ్ రాష్ట్ర స్థాయిలో 369వ ర్యాంకు సాధించగా ఎం. నివాస్ రెడ్డి 2824, ఆర్. అభినయ్ 3194, ఎ. చరణ్ తేజ 3200, డి. వర్షిత్ 4114, బి. వాంగ్మయి 4181 ర్యాంకులు సాధించారు. ఈ విభాగంలో ఐదు వేల లోపు 6 మంది, పది వేల లోపు 17 మంది, పదిహేను వేల లోపు 71 మంది, ఇరవై వేల లోపు 139 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. అగ్రీకల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో జె. శ్వేత 351వ ర్యాంకు సాధించగా పి. సాయి రుద్ర తేజ 1677, పి. హన్మిత 2182, పి. రాహుల్ ఆదిత్య 2491, జి. సరిత 4303, ఆర్. రిషిక 4308, ఎల్. స్మిలిత 4623 ర్యాంకులు సాధించారు. ఈ విభాగంలో ఐదు వేల లోపు 7 మంది, పది వేల లోపు 17 మంది, పదిహేను వేల లోపు 64 మంది, ఇరవై వేల లోపు 102 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో డీజీఎం గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ ఆర్ సంస్థల్లో అమలు చేస్తున్న టాప్ క్లాస్ షెడ్యూల్స్, అత్యాధునిక అప్‌డేటెడ్ స్టడీ మెటీరియల్, వారాంతపు పరీక్షలు, సగటు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఇంటర్ విద్యతో పాటు ప్రారంభం నుంచే కోచింగ్ తరగతులు నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందన్నారు. నిజామాబాద్ జోనల్ ఇంచార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు గత 12 సంవత్సరాలుగా ఎస్ఆర్ విద్యాసంస్థల విజయానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. మెరుగైన హాస్టల్ సౌకర్యాలు, పరిశుభ్రమైన ఆహారం విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను సంస్థ చైర్మన్ వరదా రెడ్డి , డైరెక్టర్లు మదుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ అజేందర్ రెడ్డి, హన్మంత్ రావు, శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మురళీధర్, నరసింహ రెడ్డి, జోనల్ అకౌంట్ ఆఫీసర్ రమేష్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
