Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 7:01 pm Posted by : ramakrishna

తలమడ్ల ప్రాథమిక పాఠశాలకు ఎస్‌ఆర్ హాచరీస్ గ్రూప్ ఫర్నిచర్ విరాళం

రాజంపేట్, బతుకమ్మ ::  

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలకు ఎస్‌ఆర్ హాచరీస్ గ్రూప్ వారు సుమారు రూ.2.5 లక్షల విలువైన ఫర్నిచర్ ఇతర సామగ్రిని విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్ గౌడ్ అభ్యర్థన మేరకు ఎస్ఆర్ హచరీస్ గ్రూప్ జీఎం సుధాకర్ రెడ్డి చొరవతో 24 డ్యూయల్ డెస్క్‌లు, 5 క్లాస్‌రూమ్ టేబుల్స్ ,ఒక కంప్యూటర్, ప్రింటర్ (స్కానర్, జీరాక్స్ సదుపాయంతో),ఒక ఆర్‌ఓ వాటర్ ఫిల్టర్,10 ఆఫీస్ కుర్చీలు పాఠశాలకు అందజేశారు.ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది ఎస్‌ఆర్ హాచరీస్ గ్రూప్ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రూప్ జీఎం సుధాకర్ రెడ్డి, మేనేజర్లు ఒబ్లేష్ ,శివకుమార్, శ్రీనివాస్‌లకు గ్రామస్థుల తరఫున,పాఠశాలల తరఫున సన్మానం నిర్వహించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్ణాల లక్ష్మి జగదీష్, ఉపసర్పంచ్ నర్మల వెంకట్,మండల విద్యాధికారి పూర్ణచందర్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ,గ్రామస్థులు పాల్గొన్నారు.అనంతరం సర్పంచ్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు .

SR Hatcheries Group donates furniture to Talamadla Primary School