… లైంగిక వేదింపులపై ఎస్ ఆర్ కళాశాల ఎదుట ఎబివిపి ఆందోళన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ఎస్సార్ విశ్వ భారతి క్యాంపస్ లో అధ్యాపకులు విద్యార్థినిలతో అసభ్యకరంగా మాట్లాడి అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ నగరంలోని లో ఉన్న వినాయక్ నగర్ లో ఉన్నటువంటి ఎస్సార్ ( మహిళల ) విశ్వ భారతి క్యాంపస్ కి ఏబీవీపీ నాయకులు వెళ్లి ధర్నా చేసి యాజమాన్యంపై మండిపడ్డారు
ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థినిలకు కనీస రక్షణ కల్పించే లేనటువంటి స్థితిలో ఎస్సార్ యాజమాన్యం ఉండటం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థినులతో అసభ్యకరంగా మాట్లాడి అసహ్యంగా ప్రవర్తిస్తున్న లెక్చరర్స్ గణేష్ అలాగే కెమిస్ట్రీ లెక్చరర్ వేణుగోపాల్ ఇలాంటి అధ్యాపకుల నుండి విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. క్యాంపస్ లో విద్యార్థినులపై లైంగిక వేదింపులు జరుగుతున్నప్పటికీ ఆ లెక్చరర్ ని తీసివేయకుండా ఇప్పటివరకు క్యాంపస్ లో ఉంచుకోవడం సరైన పద్ధతి కాదు అన్నారు. విద్యార్థినులను ఏం చేసినా కూడా మీరు ఉపాధ్యాయులకు సపోర్ట్ చేస్తారా ఇలా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఏబీవీపీ ఊరుకోదు అని ఎస్సార్ విశ్వ భారతి కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలి అనే ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది అన్నారు. వెంటనే మహిళల రక్షణ విషయంలో పై అధికారులు డి ఐ ఈ ఓ స్పందించి ఎస్సార్ విశ్వ భారతి కళాశాల గుర్తింపును రద్దు చేయాలి అలాగే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న అధ్యాపకుల పైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ వంజరి బాలకృష్ణ, విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ ధామ సునీల్, కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్, ప్రేమ్, పవర్ సిద్దు, మున్నా, యోగేష్, ఆర్యన్ ,అమర్నాథ్, రంజిత్, సన్నీ , అంజిత్, దినేష్, లక్కీ తదితరులు పాల్గొన్నారు.