Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2024, 5:38 pm Posted by : ramakrishna

స్టేట్ లెవల్ అండర్ 17 వాలీబాల్ కు ఎస్ఆర్ కాలేజ్ విద్యార్థి ఎంపిక 

 భీమ్‌గల్, బతుకమ్మ : స్టేట్ లెవల్ అండర్ 17 వాలి బాల్ కుఎస్ ఆర్ కాలేజ్ స్టూడెంట్ ఎంపికయ్యడు. ఈనెల 19న నిజామాబాద్ జిల్లాలో అండర్ 17 వాలీబాల్ స్టేట్ లెవెల్ ఎంపిక కొరకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అక్షయ్ దీప్ స్టేట్ లెవెల్ అండర్ 17 కు ఎంపిక అయ్యాడు. స్టేట్ లెవెల్ కు ఎంపికైన స్టూడెంట్ ను కాలేజ్ యజమాన్యం కళాశాల డైరెక్టర్ అఖిల్,కళాశాల ప్రిన్సిపాల్ స్రవంతి, అధ్యాపకులు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ అఖిల్ మాట్లాడుతూ. ఇటీవల జరిగిన అండర్ 17 వాలీబాల్ పోటీల్లో మొదటిసారి ఎస్ఆర్ కాలేజ్ నుండి విద్యార్థి ఎంపికవ్వడం గొప్ప విషయమన్నారు. ఎంపికైన క్రీడాకారుడు అక్షయ్ దీప్ ను కళాశాల ఉపాధ్యాయుల బృందం  అభినందించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్, ఆకాష్, బాల్రాజ్, సహన, లావణ్య, వీణ, అమూల్య తదితరులు పాల్గొన్నారు.