ఎస్ఆర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ దాష్టికం
విద్యార్థి కి వాతలు తేలేలా కొట్టిన వైనం ఉపవాసం ఉన్న విద్యార్థిని కొట్టినందుకు నిలదీసిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్డులో గల ఎస్ఆర్ కాలేజీలో రెసిడెంట్ విద్యార్థిపై వార్డెన్ దాడి చేశాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన వాహజుద్ధిన్ (17) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో వాహజుద్ధిన్ హాస్టల్ లో ఉండి చదువుతున్నాడు. చదువకుండా నిధ్ర పోతున్నాడని ఆదివారం హాస్టల్...