పిచ్చి మొక్కల నిర్మూలనకు పురుగుమందుల పిచికారీ

  నందిపేట్, బతుకమ్మ :   గ్రామంలో విచ్చలవిడిగా పెరిగిన పిచ్చి మొక్కల నిర్మూలన కోసం నందిపేట్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పిచికారీ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని రోడ్ల వెంబడి, డ్రైనేజీల పరిసర ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలను తొలగించేందుకు పంచాయతీ సిబ్బంది కలుపు నివారణ మందు పిచికారీ చేశారు. 6, 7, 8 వార్డుల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పిచ్చి మొక్కల వల్ల దోమల బెడద ఎక్కువై గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున, ముందస్తు...