Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 8:31 pm Posted by : ramakrishna

రేపు గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

 

. . . గురుకులాల ఆర్ సి ఓ మాధవి లత వెల్లడి

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చేరెందుకు మిగిలిన 9 సీట్లకు ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థులు సోమవారం నిర్వహించే స్పాట్ అడ్మిషన్లు సద్వినియోగం చేసుకోవాలని ధర్మారం సాంఘిక సంక్షేమ కళాశాల ప్రిన్సిపల్ గురుకులాల ఆర్ సి ఓ జి మాధవి లత వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మహిళలకు 6 సీట్లు, పురుషులకు మూడు సీట్లు మిగిలి ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థిని విద్యార్థులు సోమవారం స్పాట్ అడ్మిషన్ హాజరై పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుందని వివరించారు. అనంతరం పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ ప్రకారం సీట్లు కేటాయిస్తామని ఆమె వివరించారు. పట్టణ ప్రాంత విద్యార్థులు రెండు లక్షల రూపాయల లోపు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు 1,50,000 లోపు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించారు. స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ధర్మారం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ జిల్లా గురుకులాల కళాశాల ఆర్ సిఓజి మాధవి లత వెల్లడించారు.