Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 8:07 pm Posted by : ramakrishna

మహిళల్లో క్రీడా ప్రతిభ అద్భుతం

  • ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళా క్రీడాకారుల పట్టుదల, కృషి మరియు క్రీడా ప్రతిభ అద్భుతం అని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.  నగరంలోని ఫూల్లాంగ్ క్రాస్ రోడ్ లో గల టీటీడీ కల్యాణ మండపం ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా వుశు లీగ్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ 2018లో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాతే అందరూ ఆటలవైపు మొగ్గు చూపుతున్నారని మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ ఆటల పోటీలలో పాల్గొడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అని గుర్తు చేశారు. ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు యువతలో శారీరక, మానసిక, సామాజిక సామర్థ్యాలను పెంపొందిస్తాయి. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని అన్నారు.

Sports talent among women is amazing.