Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2025, 7:03 pm Posted by : ramakrishna

మానసిక ఉల్లాసానికి క్రీడలు

  • హోరా హోరీగా వెల్నెస్ హాస్పిటల్స్ క్రికెట్ లీగ్
  • బహుమతులు అందజేసిన డిసిపి అడ్మిన్ బస్వా రెడ్డి

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ   : యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమని,క్రీడల వల్ల శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని డిసిపి (అడ్మిన్)బస్వా రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో  క్రికెట్ లీగ్ జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు క్రికెట్ లీగ్ ను ఎండి సుమన్ గౌడ్,అసద్ ఖాన్,వివేక్ రెడ్డి,వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేయగా 24 టీమ్స్ పేర్లు నమోదు చేసుకున్నాయన్నారు. శనివారం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిపి (అడ్మిన్) బస్వా రెడ్డి విచ్చేశారు. క్రీడల్లో గెలుపొందిన విన్నర్ టీం తెలంగాణ యూనివర్సిటీ,రన్నర్ టీం చాణక్య డిగ్రీ కళాశాల నిర్మల్ టీం లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బస్వారెడ్డి మాట్లాడుతూ యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమని,క్రీడల వల్ల శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెల్నెస్ హాస్పిటల్స్ క్రికెట్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడ అంటే సెల్ ఫోన్ లో గేమ్స్  అవుతున్న ఈ తరుణంలో ఇలాంటి  క్రీడ పోటీల వల్ల యువతలో దాగివున్న నైపుణ్యం  బయటకు వస్తుందని,జిల్లాస్థాయిలో ఆడటం వల్ల,రాష్ట్ర,జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు. యువకులు కాబోయే భావి భారత పౌరులు అని,క్రీడల వల్ల పరిచయాలు పెరుగుతాయని,కులం మతం తేడా లేకుండా అందరం ఒక్కటే అని యూనిటీ గా ఉండి ఆడటం క్రీడ స్ఫూర్తి వల్ల వస్తుందన్నారు. ఇది దేశభక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు.  పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదని యువత గమనించాలని,క్రీడ స్ఫూర్తి వల్ల ఉన్నతంగా ఎదుగుతామని,ఇది వ్యక్తి గతంగా కాకుండా దేశానికి ఉపయోగ పడుతుందని అన్నారు.  హాస్పిటల్స్ లో డాక్టర్లు క్రీడలు ఆడాలని చెబుతారని,వెల్నెస్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. నిజామాబాద్ లో క్రికెట్ లీగ్ ను ఏర్పాటు చేసి నిజామాబాద్,కామారెడ్డి,బోధన్,ఆర్మూర్,బాన్సువాడ,నిర్మల్ నుంచి వివిధ కళాశాలల నుంచి టీమ్స్ వచ్చేలా చొరవ చూపి,దిగ్విజయంగా పూర్తిచేసిన వెల్నెస్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్  ను అభినందిస్తున్నామన్నారు. ఈ క్రీడలను ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని సూచించారు. హైదరాబాదులో వెల్నెస్ హాస్పిటల్ ఎన్నో వైద్య సేవలు అందిస్తుందని,నిజామాబాదులో ఏడవ బ్రాంచ్ ను ను ఏప్రిల్ లో ప్రారంభించడం జిల్లా ప్రజలకు సువర్ణ అవకాశమన్నారు.

  • విజయం సాధించిన తెలంగాణ యూనివర్సిటీ జట్టు

ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో నిర్మల్ కు చెందిన చాణక్య డిగ్రీ కాలేజ్,తెలంగాణ యూనివర్సిటీ జట్టులు తలపడగా మొదట టాస్ గెలిచిన తెలంగాణ యూనివర్సిటీ జట్టు ఫిల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చాణక్య డిగ్రీ కళాశాల జట్టు నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన తెలంగాణ యూనివర్సిటీ జట్టు చివరి ఓవర్ లో ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ప్రతిభ కనబరిచిన మోసిన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్,మ్యాన్ ఆఫ్ ద సిరిస్ ను మోసిన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఎం అర్ ఓ నాగర్జున,  యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్,క్లస్టర్ హెడ్ భార్గవ్,జిఎం మన్నె రాజేష్,శ్రీధర్,నీల మహేష్,వెల్నెస్ హాస్పిటల్ సిబ్బంది,క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.