Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 11:31 am Posted by : ramakrishna

అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి.. క్రీడల శాఖ కేటాయింపు

 శాఖ మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం 

వెబ్ న్యూస్, బతుకమ్మ: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగుతుండగా సభలో కూర్చొని రమ్మీ ఆడారని మంత్రి మాణిక్ రావ్ కొకాటేపై వచ్చిన ఆరోపణలు విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈక్రమంలో కొకాటేపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తొలగించి క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను ఫడ్నవీస్ ప్రభుత్వం కేటాయించింది. కాగా, మంత్రి వర్గం నుంచి ఆయన్ను తప్పించకుండా శాఖను మార్చడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.