Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2024, 5:07 pm Posted by : ramakrishna

మానసిక ఉల్లాసానికి, మనోధైర్యానికి క్రీడలు దోహదపడతాయి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

కమ్మర్ పల్లి, బతుకమ్మ :  క్రీడలు మానవాళికి మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యకర జీవితానికి, మనోదైర్యాన్నిచ్చేందుకు దొహధపడతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన ఎస్ జీ ఎఫ్ మండల అంతర పాఠశాలల క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు అనేవి కేవలం ఫిట్ నెస్ కోసమే కాకుండా ఉన్నతంగా మన మన కేరీయర్ ను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగాడతాయన్నారు.క్రీడల్లో గెలుపోటములు సహజమని,అన్నింటిని సమానంగా తీసుకోన్నప్పుడే స్పోర్టింగ్ స్పీరిట్ విద్యార్థుల్లో అలవడుతుందన్నారు. క్రీడోత్సవాలను నిర్వహణకు కృషి చేసిన అన్ని పాఠశాల ల ఉపాధ్యాయ బృందం ,పీ ఈ టీ బృందానికి, గ్రామాభివృద్ధి కమిటీలకు ఆయన అభినందనలు తెలిపారు. రాజ్ కుమార్ ,మల్లేష్ లాంటి క్రీడా ప్రేమికులు ఉండటం వల్లనే ఇంకా క్రీడలు గొప్పగా నిర్వహిస్తున్నారని, క్రీడలు సజీవంగా ఉండటానికి మీ కృషి అభినందనీయం ఎమ్మెల్యే ప్రశంశించారు.గ్రామీణ స్థాయి నుండి క్రీడల్లో రాణించి రాష్ట్ర, దేశ స్థాయిలో ఆడిన వాళ్ళు ఉన్నారని,వారిని మీరంత స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మా వియ్యంకుడు, వ్యాపారవేత్త దయానంద రెడ్డి దాతృత్వానికి అవధులు లేవని,ఆయన జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గం లో అనేక పాఠశాల కు అవసరమైన డెస్క్ బెంచ్ లు,స్పోర్ట్స్ డ్రెస్లు,స్పోర్ట్స్ మెటీరియల్,కంప్యూటర్ లు ఇలా ఇస్తూనే ఉన్నారన్నారు. ఇనాయత్ నగర్,అమీర్ నగర్ పాఠశాలలకు అవసరమైన డ్రెస్ లు స్పోర్ట్స్ మెటీరియల్ ఆయన ద్వారా అందజేయడానికి కృషి చేస్తానన్నారు.

తల్లుదండ్రులు తమ తమ పిల్లలను చదువుల్లోనే కాకుండా క్రీడల్లో ప్రోత్సహించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.