గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడల పోటీలు
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో శనివారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి వి.బాలయ్య హైకోర్టు అడ్వకేట్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వి.బాలయ్య మాట్లాడుతూ ఆటల వలన విద్యార్థుల లో శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వం పెంచడానికి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి అని అన్నారు. వివేకానంద స్వామి ఆటలు మనకు ధైర్యం, సంకల్పం, సమర్థత ను నేర్పిస్తాయని ప్రతి ఆట మన జీవితంలోని సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుందని...