Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2025, 8:53 pm Posted by : ramakrishna

గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలు అభినందనీయం

  • కొత్తబాది టోర్నమెంట్ సీజన్ 4 విజేతకు కప్ అందజేసిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ 

 

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ మండలంలోని కొత్తబాది గ్రామంలో ప్రభుత్వ  వ్యవసాయ సలహాదారులు పోచారం  శ్రీనివాస్  రెడ్డి,  తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్  కాసుల బాల్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ లో కొత్తబాది , బాన్సువాడ జట్లు తలపడ్డాగ కొత్తబాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్లో విజేతగా నిలవగా రన్నర్ అప్ గా బాన్సువాడ ఫిష్ మార్కెట్ టీం నిలిచింది.రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్  విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, గ్రామీణ స్థాయి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రికెట్ టోర్నిలు ఎంతో దోహదపడతాయన్నారు.గెలుపు ఓటములు సమానంగా తీసుకుని క్రీడలో మున్ముందు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్  ప్రెసిడెంట్ అసద్ బిన్  మోసీన్ , మాజీ ఎంపీపీ ఎజాస్ ,  కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధు సుధన్ రెడ్డి , సహాబ్,రాయిస్ ,రేంజర్ల సాయిలు  ,  షోయెబ్ , ప్రదీప్ , సాయి రెడ్డి  , సాయిలు , రఘు తదితరులు  పాల్గొన్నారు.

Sports competitions at rural level are commendable