Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2025, 6:11 pm Posted by : ramakrishna

మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం

  • పోలీస్ కమిషనర్ సాయిచైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసుల మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని పోలీస్ మైదానంలో అన్ని విభాగాలైన నిజామాబాద్ సబ్ డివిజన్, ఆర్మూర్ సబ్ డివిజన్, బోధన్ సబ్ డివిజన్, ఆర్ముడ్ రిజర్వ్ విభాగం , అలైడ్ బ్రాంచులు, హోమ్ గార్డ్స్ విభాగాల మధ్య పోలీస్ క్రికెట్  మ్యాచ్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ప్రజా రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ ఎంతో ఒత్తిడికి గురవుతు , క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. స్పోర్ట్స్ లో పాల్గొని రిఫ్రెష్ అయిన పోలీసులు తిరిగి మరింత ఉత్సాహంతో విధుల్లో బాధ్యతలు నిర్వహించాలని అన్నారు. సమయం దొరికినప్పుడు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. పోలీసులు ఉద్యోగ వృత్తిలో ఎంతో బిజీగా గడుపుతామని, క్రీడలు జీవితంలో మానసిక ఒత్తిడిలను తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో చాలా బాగా రాణిస్తున్నారని, క్రీడాకారులు అందరిలో స్కిల్స్ టాలెంట్ బాగా ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ప్రజల కోసం పనిచేయాలని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ క్రికెట్ మ్యాచ్ రెండు రోజులు నిర్వహించడం జరుగుతుందని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నిజామాబాదు అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) బస్వా రెడ్డి, అదనపు పోలీస్ కమీషనర్ (ఏఆర్ ) రామ్ చందర్ రావ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి , బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్ , ఆర్మూర్ ఏసీపీ జె.వెంకటేశ్వర్ రెడ్డి , సీఐలు, ఆర్ఐలు,  ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sports are necessary for mental well-being.