ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్
భీంగల్, బతుకమ్మ : క్రీడలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసం ఉంటుందని, ఆత్మస్థైర్యం పెరిగుతుందని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని బాబాపూర్ లో నిర్వహిస్తున్న సీయమ్స్ కప్ 2024 మండల క్రీడాలను ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ మండల స్థాయి క్రీడా టోర్నమెంట్ ల నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల ప్రతిభ ను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్ వేదికగా గ్రామీణ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని అన్నారు. ఈ సీ. యమ్ స్ కప్ 2024 మండల టోర్నిలో కబడ్డీ, ఖో. ఖో,వాలీబాల్ క్రీడాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షబ్బీర్,ఎం. ఈ. ఓ స్వామి, ఎం. పీ.ఓ జావీద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్న బాబన్న, ఏ. పీ. ఓ అశోక్, పీ. డీ లు రమణ, భూపతి,చిన్నయ్య, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.