- తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలి
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మర్ పల్లి, బతుకమ్మ : నిజ జీవితంలో విద్యార్థులకు విద్యతో పాటుగా క్రీడలు కుడా అవసరమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలో నిర్వహిస్తున్న మండల క్రీడత్సవాలను ఆయన కాగాడ వెలగించి ప్రారంభించారు.ఈ సందర్బంగా విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పిల్లల తల్లిదండ్రులు విద్యతో పాటు క్రీడాలను ప్రోత్సహించాలన్నారు. క్రీడలు ఆడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ప్రశాంతత లభిస్తుందని, క్రీడలు మనలో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పుతాయన్నారు. ఎవరైతే క్రీడలు ఆడరో వారు జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు తట్టుకోలేరని, క్రీడలు ఆడే వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకొని వాటిని ఆదిగమించి నిలబడుతారన్నారు. నిజామాబాద్ జిల్లాలో అందులో ఆర్మూర్ డివిజన్ లో మంచి పీ ఈ టీ లు ఉన్నారని, ఎక్కడ క్రీడలు జరిగిన అందరు కలిసికట్టుగా ఉండి సమన్వయంతో వాటిని విజయవంతం చేస్తారన్నారు. ఇక్కడి విద్యార్థులు జాతీయ స్థాయిలో క్రీడల్లో రానించడానికి డీ ఎస్ డీ ఓ పవన్, పీ డీ విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్, రాజకుమార్ వారితో పాటు సుమారు 30 మంది పీ ఈ టీ ల కృషి ఎంతో ఉందన్నారు. వీరి కృషి తో 100 మంది కి. పైగా జాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారులు తయారయ్యారని, వీరి శ్రమకు ఇదే ఉదాహరణ అన్నారు. మండల స్థాయి క్రీడలను నిర్వహిస్తున్న అమీర్ నగర్ గ్రామంలోనే రవీందర్ నాయక్ జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా ఎదిగి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ జాబ్ సంపాదించారని, ఇదే గ్రామానికి చెందిన ఆకుల రాజన్న ఇద్దరు కూతుళ్లు కుమారుడు స్పోర్ట్స్ కోటలోనే జాబులు సంపాదించారన్నారు. స్పోర్ట్స్ ద్వారా విద్యార్థులకు జరిగే లాభానికి అమీర్ నగర్ గ్రామమే ఉదాహరణ అన్నారు. ఈ గ్రామంలో ఇంత చక్కగా క్రీడలను ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీకి, గ్రామ అభివృద్ధి కమిటీకి, విద్యాధికారులు అందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. మార్చ్ ఫాస్ట్ కూడా పిల్లలందరూ చాలా చక్కగా ప్రదర్శించారని, ఇనాయత్ నగర్, ఉప్లూర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మా వియ్యంకుడు దయానంద రెడ్డి గారి సహకారంతో షూష్, డ్రస్సులు అందజేసే విధంగా కృషి చేస్తాననన్నారు. అమీర్ నగర్ గ్రామ పాఠశాలకు పీ టీ ని ఇప్పించడంలో, తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వానికి విన్నవించి మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. నృత్య ప్రదర్శన చేసిన విద్యార్ధినులు చాలా చక్కగా అభనయించారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమం లో కమ్మర్పల్లి. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, డీ ఎస్ డీ ఓ పవన్, పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, పీ డీ లు విద్యాసాగర్ రెడ్డి, మల్లేష్, రాజకుమారు, తహసీల్దార్, ఎంపీ డీఓ లు, పీ ఈ టీ లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
