Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2024, 10:14 pm Posted by : ramakrishna

రాష్ట్ర కబడ్డీ ఉపాధ్యక్షుడిని సన్మానించిన స్పోర్ట్స్ అకాడమీ

బతుకమ్మ,ముప్కాల్:  ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ముప్కల్ మండల కేంద్రానికి చెందిన శ్రీ కబడ్డీ గంగాధర్ గారిని స్థానిక ఎస్సై శ్రీ రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో క్రీడాకారులు అందరూ కలిసి ఘనంగా సన్మానించడం జరిగినది.  సన్మాన గ్రహీత కబడ్డీ గంగాధర్ గారు మాట్లాడుతూ  గ్రామీణ క్రీడాకారులని  అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకురావడనీకీ ఈ పదవి ఉపయోగపడుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు… ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎస్సై రజినీకాంత్ మాట్లాడుతూ   ముక్కాల స్పోర్ట్స్ అకాడమీ వీరు చేసే కార్యక్రమాలు, సేవలను అభినందించారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు అంజయ్య, గంగారెడ్డి, నర్సింగ్ దాస్, దాసరి నరేష్,గంగరాజు, హరీష్, సాయిలు, రమేష్, నందు, అజయ్, అన్వేష్, దాసు తదితరులు పాల్గొన్నారు