Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 9:09 pm Posted by : ramakrishna

విద్యపై వెచ్చించేది ఖర్చు కాదు .. భవిష్యత్తు తరాలకు పెట్టుబడి

 

. . . ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల

 

. . . అన్ని హంగులలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్

 

. . . గత ప్రభుత్వాలు విద్యను నిర్వీర్యం చేశారు

 

. . . రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని.. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన విద్యను అందించే దిశగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రతి నియోజకవర్గంలో నిర్మించతలపెట్టినట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. రూరల్ మండలం మల్కాపూర్(ఏ) గ్రామంలో రూ. 200 కోట్లతో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భూమి పూజ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వేద పండితుల మంత్రోచరణల నడుమ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు విద్య భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలలోనే చదువుకున్ననని గుర్తుచేశారు. అధునాతన హంగులతో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను రూ.200 కోట్లతో 20ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుందన్నారు. అన్ని రకాల వసతులు పాఠశాలలో కల్పించడం జరుగుతుందన్నారు. వసతి గృహం, క్రీడా మైదానం, మధ్యాహ్న భోజనం కోసం 1500 మంది కూర్చునే డైనింగ్ హాల్ తో పాటు ఇతరత్రా అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కులాల వారిగా విద్యను విభజించారని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో చేసిందేమీ లేదని ఇది నేనంటున్న వ్యాఖ్యలు కావని కేసీఆర్ బిడ్డే అంటున్నారని పేర్కొన్నారు. ఇక బీజేపీ రాముడి పేరుతో రాజజోయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

. . . గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం

అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త బట్టలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో మొత్తం 78 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 59 గ్రౌండింగ్ పూర్తి చేసుకున్నాయి. రెండవ విడతలో సైతం అర్హులకు ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, సర్పంచ్ ఫోరం రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు వాసు, బాగారెడ్డి, ఉమ్మాజి నరేష్, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, ధర్మాగౌడ్, రాంచందర్ గౌడ్, శ్యాం సన్, మోహన్, ఫిషరీస్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ నీరజ-కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

 

Spending on education is not an expense, it is an investment in future generations.