త్వరితగతిన ‘హిట్ అండ్ రన్’ కేసుల విచారణ
నిజామాబాద్, బతుకమ్మ: గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన (హిట్ అండ్ రన్) కేసుల్లో బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు చట్ట ప్రకారం నష్ట పరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన విచారణ చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్డీవోలను ఆదేశించారు. గురువారం నిర్వహించిన హిట్ అండ్ రన్ కేసుల జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 32 హిట్ అండ్ రన్ కేసులు నమోదవగా, వాటిలో 27 ప్రమాదలకు సంబంధించి బాధిత కుటుంబాలను గుర్తించామని,...