నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ : నాలుగు ఆనకట్టల నిర్మాణ పనులను మరింత వేగంగా జరిపించాలని, ఎక్కువ  యంత్రాలను తెప్పించి మరింత వేగంగా రాత్రింబవళ్లు పనులు చేయాలని కాంట్రాక్టర్ కు ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నాలుగు ఆనకట్టల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన   మాట్లాడారు.  సిద్దాపూర్ రిజర్వాయర్ రూ. 258 కోట్ల...