బోధన్ నుండి అరుణాచలం వరకు ప్రత్యేక టూర్ బస్ ప్రారంభం

బతుకమ్మ, బోధన్ : బోధన్ ఆర్టీసీ డిపో నుండి అరుణాచలం దేవస్థానానికి ప్రత్యేక టూర్ ప్యాకేజ్ బస్‌ ప్రారంభమైంది. ఈ యాత్రలో భక్తులు కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శించి, అరుణాచలేశ్వర స్వామిని దర్శించనున్నారు. తిరుగు ప్రయాణంలో భక్తులు అల్లంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని జూలై 11న బోధన్‌కు చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ విశ్వనాథ్, అసిస్టెంట్ మేనేజర్ బంసి లాల్, ఎం.ఎఫ్. శ్రవణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.