Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 4:10 pm Posted by : ramakrishna

రేపటి నుంచి కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు తెలిపారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచనల మేరకు డివిజన్ ల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. డివిజన్ అధ్యక్షులుగా పని చేయాలనుకునే వారితోపాటు ఇప్పటికే డివిజన్ అధ్యక్షులుగా కొనసాగుతున్న వారు తమ బయో డేటా, ఆధార్ కార్డు, ఎలక్షన్ కార్డు వెంట తీసుకొని నిర్ణీత తేదీల్లో సమావేశానికి హాజరు కావాలని వేణు సూచించారు. ప్రతి డివిజన్ నుంచి ముఖ్య కార్యకర్తలు 15 మంది హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

సమావేశాలు ఇలా..

ఈనెల 28వ తేదీన కంఠేశ్వర్ హౌజింగ్ బోర్డు కాలనీలో 19,20,21,35,36,41,42,43 డివిజన్ ల, అలాగే బాబన్ సహబ్ పహాడ్ ప్రాంతంలోని మెహబూబ్ ఫంక్షన్ హాలులో 9,10,11,12,13,14,15,27,30,31,32 డివిజన్ ల సమావేశాలను నిర్వహించనున్నారు. 29వ తేదీన కోటగల్లీలోని గోనెరెడ్డి కల్యాణ మండపంలో 6,7,8,22,23,24,25,26,28,45,50 డివిజన్ ల, కాంగ్రెస్ భవన్ లో 29,33,34,51,53,54,55,56,57,58,59,60 డివిజన్ ల సమావేశాలను, 30వ తేదీన బొబ్బిలి వీధిలోని మున్నూరుకాపు సంఘంలో 44,46,47,48,49 డివిజన్ ల, గౌతంనగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో 16,17,37,38,39,40 డివిజన్ ల సమావేశాలను నిర్వహించనున్నారు.

Special sessions of Congress from tomorrow