మానేరులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీం
ఐదు శాఖల అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య బుధవారం గల్లంతు అయ్యారు.ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్,...