Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 6:34 pm Posted by : ramakrishna

ఓటర్ జాబితాపై ప్రత్యేక పునఃసమీక్ష

మద్నూర్, బతుకమ్మ: ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో తహసీల్దార్ కార్యాలయం మద్నూర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఓటర్ జాబితా మార్పులు, చేర్పులు, తొలగింపులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ లలో బీఎస్ఓ లకు సహకరించాలని, రాజకీయ పార్టీల బూత్ లెవెల్ అసిస్టెంట్ లను నియమించుకోవాలని అన్నారు. అనంతరం నియోజక వర్గం లోని జుక్క నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల తహసీల్దార్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటర్ జాబితా ప్రత్యేక పునఃసమీక్ష షెడ్యూల్ ఇచ్చినందున దానిపై పకడ్బందీగా, తప్పులు పోకుండా సమీక్ష చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తహశీల్దార్లు ఎం డి ముజీబ్, బి అనిల్, వేణు గోపాల్ గౌడ్, లత, బిక్షపతి, మారుతి, రాజా నరేందర్ గౌడ్, నాయబ్ తహసిల్దార్ లు శరత్, హేమలత , శివ రామకృష్ణ మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు డి సాయిలు, టి సంతోష్, బన్సి పటేల్, ఈబిత్వర్ రోహిదాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.