- విడీసీ ఆధ్వర్యంలో అన్నదానం
- వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
వేల్పూర్, బతుకమ్మ : శ్రావణ మాసంను పురస్కరించుకొని మండలంలోని రామన్నపేట్ అయ్యల గుట్టపై సోమవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. యేటా నిర్వహించే ఈ శ్రావణ సోమవార పూజల్లో భాగంగా ఆలయ గద్దె పై శ్రీవీరభద్రుడు, అమ్మవారికి జంగమ్మయ్య ప్రత్యేక పూజలు చేసి హారతి, నైవేద్యం చేశారు. అనంతరం భక్తులు స్వామి వారికి నైవేద్యలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్బంగా స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ భక్తులకు అన్నధాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన సేవలో స్థానిక యూత్ సంఘాల సభ్యులు పాల్గొని సేవ చేశారు.