Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2024, 5:13 pm Posted by : ramakrishna

దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గల దస్తగిరి ఆశ్రమంలో దత్త జయంతిని పురస్కరించుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ ప్రత్యేక పూజలు వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ దైవ మార్గంలో ప్రజలు నడవాలని ఆయన అన్నారు.  దస్తగిరి ఆశ్రమంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజలను ఇటీవల నిర్వహిారని ఆయన అన్నారు. ఎల్లారెడ్డి మండల ప్రజలకు శుభ పరిణామం అని రానున్న రోజుల్లో దస్తగిరి ఆశ్రమం మరింత అభివృద్ది చెందాలని, దానికి భక్తులతోపాటు ప్రజలు సహాయ సహకారాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీనివాస్ భద్రి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం దస్తగిరి ఆశ్రమ కమిటీ సభ్యులు శాలువాతో ఘంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు అదిమూలం సతీష్ కుమార్, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఎగుల నర్సింలు, మునిసిపల్ సభ్యులు ఎరుకల సాయిలు, శ్రీనివాస్ నాయక్,  మాజీ సర్పంచ్ రఘువీర్ గౌడ్, శ్రవణ్, ఇమ్రాన్, గంగారెడ్డి, భర్కాత్ నాగం సురేందర్, నాగరాజు, రవి, మనోజ్, కృష్ణ రెడ్డి, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.