రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం మొదటి సోమవారం సందర్బంగా స్వామివారికి అభిషేకాలు, మంగళ హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజేశ్వర్ అప్ప, ఆలయ కమిటీ నిర్వాహకులు కటికే రామ్ రాజ్, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.