Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2025, 8:48 pm Posted by : ramakrishna

ప్రజలు సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

  • టీఎన్జీఓల ఆధ్వర్యలో నవదుర్గమాత ఆలయంలో మహాబోనాలు
  • బోనాలను సమర్పించిన రూరల్ ఎమ్మల్యే, కలెక్టర్, పోలీస్ కమిషనర్

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సవాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండేలా చల్లంగా చూడాలని పాత కలెక్టరేట్ శ్రీశ్రీశ్రీ నవ దుర్గమాత అమ్మవారిని కోరుకున్నారు అతిథులు. టిఎన్జీవో ఆధ్వర్యంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ నవదుర్గ మాత ఆలయంలో ఎంప్లాయిస్  జేఎసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ , టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన…. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం

Special prayers to Goddess Durga for prosperity

జరిగిన బోనాల ఉత్సవానికి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య, అఖిలభారత ఉద్యోగ సమాఖ్య ఉపాధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం బోనాలను పాత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల శ్రీశ్రీశ్రీ నవదుర్గ మాత ఆలయం నందు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ… ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూనే , కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా ఆషాడ మాస బోనాల ఉత్సవాలు  ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, ఉద్యోగులందరికీ ఆ జగన్మాత  ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. తనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Special prayers to Goddess Durga for prosperity