నందిపేట్ , బతుకమ్మ :
భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నిర్మాత తెలంగాణ జాతిపిత భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ జన్మదిన సందర్భంగా నందిపేట్ మండలంలోని నందికేశ్వరాలయంలో ప్రత్యేక అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాలని భగవంతున్ని ప్రార్థించారు. అనంతరం వివిధ విద్యా సంస్థలలో కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఉపన్యాస వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఆస్పత్రులలో రోగులకు పళ్ళ పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ కేసీఆర్ కారణజన్ముడని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 14 ఏళ్లు పోరాడి సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసి, దేశంలోని 20 ఉత్తమ గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే దాంట్లో 14 గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండడమే తెలంగాణ ప్రగతికి సూచికని, తెలంగాణ రైతులు, ప్రజలు దేశంలోని అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో జీవిస్తున్న పౌరులని కేంద్ర ప్రభుత్వం కొనియాడరన్నారు. తాగునీరు, సాగునీరు, రైతులు, యువకులు ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలవడం కేసీఆర్ మార్క్ పాలన అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బాబు రాజ్, రామారావు మోహన్ భారత రాష్ట్ర సమితి పార్టీ మండల నాయకులు దారం సురేష్, పాషా రఫీ, వెల్మల్ వార్డు మెంబర్లు వినయ్, రమేష్, తాటికాయల సుభాష్, దుబాయ్ శీను, రాజేందర్, నరేష్, నాయకులు గణేష్, గడ్డం సాగర్, సాయరెడ్డి, నారాగౌడ్, నరసయ్య, సోఫియా రాము, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
